అమీర్ ఖాన్ పికె రీమేక్ లో కమల్ హాసన్.?

kamal-hasan
గత సంవత్సరం చివర్లో బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అయిన అమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘పికె’ సినిమా విడుదలై రికార్డులు సృష్టించింది. ఈ సినిమా అటు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చెయ్యడంలో, ఓ మెసేజ్ ని చెప్పడంలో మరియు బాక్స్ ఆఫీసు రికార్డ్స్ పరంగా కూడా అందరినీ మెప్పించింది. తాజా సమాచారం ప్రకారం సౌత్ ఇండియన్ ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ అయిన జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ వారు విధు వినోద్ చోప్రా – రాజ్ కుమార్ హిరనిని కలిసి రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ వారు విధు వినోద్ చోప్రా – రాజ్ కుమార్ హిరని ఫిల్మ్స్ అయిన మున్నా భాయ్ సీరీస్ మరియు 3 ఇడియట్స్ సినిమాలని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేసారు.

ఈ సినిమా సౌత్ ఇండియన్ రీమేక్ లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తారని అంటున్నారు. కానీ ఈ చర్చలన్నీ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఈ మూవీ రీమేక్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పికె సినిమా ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకి కొన్ని మతాల వారి నుంచి, కొంతమంది పెద్దల నుంచి వ్యతిరేఖత వచ్చినా సినిమా మాత్రం సూపర్ సక్సెస్ అవుతుంది. ఇప్పటికీ ఈ సినిమా దేశంలోని పలు మల్టీ ప్లెక్స్ లలో ఆడుతూనే ఉంది.

Exit mobile version