ఆడియో విడుదలకు సిద్దమైన విశ్వరూపం 2 !

Published on Aug 1, 2018 12:54 pm IST

విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘విశ్వరూపం-2’. టెర్రరిజం నేపథ్యంలో ఉండబోయే ఈ సినిమాలో కమల్ నటించడమేగాక స్వయంగా దర్శకత్వం వహించి, నిర్మించిడం విశేషం. కాగా ఈ చిత్రం స్వాతంత్రయ దినోత్సవం కానుకగా ఆగష్టు 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని రేపు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించనున్నారు. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాలో పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్ వంటివారు నటించారు.
2013లో వచ్చిన ‘వివస్వరూపం’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందింది. ఈ సీక్వెల్ కోసం కమల్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More