‘ఇండియన్ 2’ టీమ్ కి ఫ్యాన్స్ రిక్వెస్ట్

‘ఇండియన్ 2’ టీమ్ కి ఫ్యాన్స్ రిక్వెస్ట్

Published on Apr 15, 2024 10:02 AM IST

విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. జూన్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. విడుదలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ, చిత్రబృందం మాత్రం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టలేదు. దీంతో, కమల్ హాసన్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు వరకు ఇండియన్ 2 కి సంబంధించి ఒక్క సాలిడ్ అవుట్ ఫుట్ ను కూడా రిలీజ్ చేయలేదు అని, సినిమాపై అంచనాలను క్రియేట్ చేయడంలో మేకర్స్ విఫలమయ్యారు అని ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.

ఇక నుంచి అయినా అద్భుతమైన పోస్టర్స్ అండ్ సాంగ్స్, టీజర్ వంటివి రిలీజ్ చేయాలని అభిమానులు చిత్రబృందాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి. ఇక భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు, కాగా ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడీ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ‘భారతీయుడు 2’లో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు