మొదలైన కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ లాంగ్ షెడ్యూల్

Uttama-Villain-(1)
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కమల్ హాసన్’. ఇటీవలే ఈ సినిమా షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చి ఇండియా తరపున ప్రతిష్టాత్మక 2014 కేన్స్ ఫెస్టివల్ కి హాజరయ్యాడు. ఈ ఫెస్టివల్ టూర్ ఫినిష్ చేసుకున్న కమల్ హాసన్ ఈ రోజు చెన్నై చేరుకున్నాడు. ఆయన చెన్నై చేరుకోగానే డైరెక్ట్ గా ‘ఉత్తమ విలన్’ తాజా షెడ్యూల్ ని చెన్నైలో ప్రారంభించారు.

ఈ తాజా షెడ్యూల్ 47 రోజులు కంటిన్యూగా జరగనుంది. ఈ షెడ్యూల్ తో సినిమా దాదాపు పూర్తవుతుంది. రమేష్ అరవింద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పూజ కుమార్, ఆండ్రియా, పార్వతి, నాజర్ కీల పాత్రలు పోషిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ – రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. సెప్టెంబర్ లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ సినిమా త్వరలో విడుదల కానుంది. అలాగే ‘ఉత్తమ విలన్’ షూటింగ్ పూర్తయ్యాక కమల్ తమిళంలో తెరకెక్కే మళయాళ ‘దృశ్యం’ రీమేక్లో పాల్గొంటాడు.

Exit mobile version