కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’కు ‘ఎన్టీఆర్’ అభయ హస్తం !

కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’కు ‘ఎన్టీఆర్’ అభయ హస్తం !

Published on Jun 8, 2018 7:56 PM IST

cuuu

‘కమల్ హాసన్’ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వరూపం’ చిత్రం ఎంతటి కాంట్రవర్సీ సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. చివరకి విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు విశ్వరూపంకి సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘విశ్వరూపం 2’. ఈ చిత్ర ట్రైలర్ ను జూ ఎన్టీఆర్ చేతుల మీదగా విడుదల చెయ్యబోతున్నారు. జూన్ 11న సాయంత్రం 5గంటలకు ఎన్టీఆర్ తెలుగు వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. హిందీ వెర్షన్ ట్రైలర్ ను అమీర్ ఖాన్, తమిళ వెర్షన్ ట్రైలర్ ను శృతి హాసన్ విడుదల చేస్తారు.

అసలు ఆగిపోయిందనుకున్న విశ్వరూపం 2 చిత్రాన్ని కమల్ హాసన్ పట్టుబట్టి పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాలనేది కమల్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆండ్రియా మరియు పూజా కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ‘విశ్వ‌రూపం 2’ చిత్రం మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

తాజా వార్తలు