తనను ఎవరు నిర్బందించలేదంటున్న స్టార్ హీరో

తనను ఎవరు నిర్బందించలేదంటున్న స్టార్ హీరో

Published on Mar 28, 2020 8:00 PM IST

kamal

లోకనాయకుడు కమల్ హాసన్ రెండు రోజులుగా తనపైన వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. తనను ఎవరు నిర్బందించలేదని ఆయన చెప్పుకొచ్చారు. కమల్ హాసన్ పార్టీ ఆఫీస్ వద్ద నెలకొన్న పరిస్థితుల రీత్యా కమల్ హాసన్ ని తమిళనాడు గవర్నమెంట్ నిర్బధంలో ఉంచింది అంటూ వార్తలు వస్తున్నాయి. దీనితో అలాంటిది ఏమి లేదు, తనను ఎవరు నిర్బందించలేదని కమల్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి తెలియజేశారు.

ఇక కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 మూవీలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ సెట్ లో ప్రమాదం జరిగి ముగ్గురు మరణించడం జరిగింది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు