ఇండియన్ 2 రిలీజ్ పై కమల్ క్లారిటీ…ఇండియన్ 3 గురించి ఏమన్నారంటే?

ఇండియన్ 2 రిలీజ్ పై కమల్ క్లారిటీ…ఇండియన్ 3 గురించి ఏమన్నారంటే?

Published on May 18, 2024 9:01 PM IST

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 చిత్రం లో తదుపరి కనిపించనున్నారు. నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ తో ఐపియల్ మ్యాచ్ స్పోర్ట్స్ ఛానెల్ లో కమల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇండియన్ 2 చిత్రం జూలై లో థియేటర్ల లోకి రానుంది అని అన్నారు. అంతేకాక ఇండియన్ 2 రిలీజైన 6 నెలల తర్వాత ఇండియన్ 3 కూడా థియేటర్ల లోకి వస్తుంది అని అన్నారు.

ఇండియన్ 2లో నటించడానికి గల కారణం ను కూడా వెల్లడించారు. శంకర్ ఇండియన్ 3 స్క్రిప్ట్‌ను కూడా తనకు వివరించాడు, అది తనను బాగా ఆకట్టుకుంది అని, అందుకే ఓకే చెప్పినట్లు తెలిపారు. ఇండియన్ 2 యొక్క గ్రాండ్ ఆడియో లాంచ్ జూన్ 1వ తేదీన జరుగుతుందని ధృవీకరించారు. కథ పెద్దది కాబట్టి మూడు గంటల్లో చెప్పలేం కాబట్టి మూడో భాగాన్ని రూపొందించామని దర్శకుడు శంకర్ తెలిపారు. కాజల్ అగర్వాల్ కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవి చందర్ ఈ భారీ బడ్జెట్ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు