“ఇండియన్ 2” ఆలస్యం అందుకే – కమల్ హాసన్!

“ఇండియన్ 2” ఆలస్యం అందుకే – కమల్ హాసన్!

Published on Mar 25, 2024 3:17 PM IST

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Hassan) వరుస భారీ చిత్రాలు చేస్తూ కెరీర్ లో దూసుకు పోతున్నారు. కల్కి చిత్రం లో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 (Indian2) మరియు ఇండియన్ 3(Indian 3) చిత్రాల పై కూడా కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. మంచి చిత్రాన్ని అందించేందుకు టీమ్ చాలా కష్టపడుతోంది అని అన్నారు. ఈ చిత్రాలకి సంబందించిన షూటింగ్ పూర్తి అయ్యింది అని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఇండియన్ 2 ఉందని అన్నారు.

క్వాలిటీ విషయం లో రాజీపడే ప్రసక్తే లేదని, ఆలస్యం అయినా మంచి ఔట్ పుట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయిన తరువాత ఇండియన్ 3 చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అని పేర్కొన్నారు కమల్. అంతేకాక శృతి హాసన్ మరియు లోకేష్ కనగరాజు లు కలిసి పని చేసిన ఒక స్పెషల్ సాంగ్ కి కమల్ లిరిక్స్ రాశారు. ఇనిమేల్ అంటూ సాగే ఈ పాట నేడు రిలీజ్ కానుంది. వీటితో పాటుగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీ కానున్నారు కమల్ హాసన్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు