ఐపీయల్ మ్యాచ్ లో ఇండియన్ 2 ను ప్రమోట్ చేయనున్న శంకర్, కమల్ హాసన్!

ఐపీయల్ మ్యాచ్ లో ఇండియన్ 2 ను ప్రమోట్ చేయనున్న శంకర్, కమల్ హాసన్!

Published on May 18, 2024 1:00 AM IST

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇండియన్ 2. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం ను అందరికీ చేరువ చేసేందుకు ప్రమోషన్స్ షురూ చేశారు.

కీలక ఐపియల్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో ఈ సినిమా ను ప్రమోట్ చేయనున్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. శంకర్ మరియు కమల్ హాసన్ ఈ ఐపియల్ మ్యాచ్ లో సినిమాకి సంబందించిన పలు విషయాలను వెల్లడించనున్నారు. ఇది మంచి తెలివైన ప్రమోషన్ అని చెప్పాలి. సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జే. సూర్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు