అక్టోబర్ 2న కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’.?

అక్టోబర్ 2న కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’.?

Published on Jul 23, 2014 5:28 PM IST

Kamalhaasan
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కమల్ హాసన్’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే కమల్ హాసన్ ‘దృశ్యం’ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ సినిమాని అక్టోబర్ 2న రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇక అధికారిక ప్రకటన చేయడం మాత్రమే మిగిలి ఉంది. ఒకేసారి ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కమల్ హాసన్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. రమేష్ అరవింద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కె. బాలచందర్ పూజ కుమార్, ఆండ్రియా, పార్వతి, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ – రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ సినిమా త్వరలో విడుదల కానుంది.

తాజా వార్తలు