కరోనాపై పోరాటానికి కమల్ మరో ముందడుగు

కరోనాపై పోరాటానికి కమల్ మరో ముందడుగు

Published on Mar 26, 2020 5:10 PM IST

kamal

సామాజిక సమస్యలపై స్పందించడంలో నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ప్రభుత్వం అవలంభిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో కమల్ తనవంతు భాద్యతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కరోనా బాధితుల సహాయార్థం పది లక్షల రూపాయలు విరాళంగా అందించిన ఆయన ప్రజలకు నిత్యావసరాలు అందడంలో ఎలాంటి జాప్యం ఉండకుండా చూడాలని ఆయన ప్రధానిని విజ్ఞప్తి చేశారు.

అంతేకాదు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్నారు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి తేనాంపేట్‌లోని త‌న ఇంటిని త‌మిళ‌నాడు ప్రభుత్వం అంగీక‌రిస్తే హాస్పిట‌ల్‌గా మార్చి వైద్య సేవ‌లు అందించ‌డానికి అనుకూలంగా మార్పులు చేసి ఇస్తాన‌ని అన్నారు. మ‌రి దీనిపై ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు