ప్రభాస్ “కల్కి” లో కమల్ రోల్ రన్ టైమ్ పై క్లారిటీ!

ప్రభాస్ “కల్కి” లో కమల్ రోల్ రన్ టైమ్ పై క్లారిటీ!

Published on May 21, 2024 7:00 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏ. డి(Kalki 2898AD). దీపికా పదుకునే, దిశా పటాని లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అయితే ఈ చిత్రం లో కమల్ హాసన్ పాత్ర రన్ టైమ్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం లో దాదాపు 20 నిమిషాలు స్క్రీన్ పై కనిపించనున్నారు. అయితే పార్ట్ 2 లో 90 నిమిషాల వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం. కమల్ హాసన్ రోల్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో క్యూరియాసిటి నెలకొంది. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు