“ఇండియన్ 2” ఆడియో లాంఛ్ ఈవెంట్ డీటైల్స్ ఇవే!

“ఇండియన్ 2” ఆడియో లాంఛ్ ఈవెంట్ డీటైల్స్ ఇవే!

Published on May 30, 2024 8:45 PM IST

స్టార్ హీరో కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 చిత్రం లో తదుపరి కనిపించనున్నారు. తెలుగులో భారతీయుడు 2 గా థియేటర్ల లోకి రానుంది. జూలై 12 న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. జూన్ 1 వ తేదీన ఈ చిత్రం ఆడియో లాంఛ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. నెహ్రూ స్టేడియం లో సాయంత్రం 6:00 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఈ చిత్రం కి చీఫ్ గెస్ట్ లుగా ఎవరు వస్తారు అనే దానిపై ఎలాంటి ప్రకటన లేదు. కాజల్ అగర్వాల్ కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవి చందర్ ఈ భారీ బడ్జెట్ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు