సల్మాన్ సారీ చెప్పి.. రిక్వెస్ట్ చేస్తే వదిలేస్తా..!

సల్మాన్ సారీ చెప్పి.. రిక్వెస్ట్ చేస్తే వదిలేస్తా..!

Published on Dec 29, 2019 1:14 AM IST

salman 1

వివాదాస్పద బాలీవుడ్ యాక్టర్ నిర్మాత మరియు క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ హీరో సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ లేటెస్ట్ మూవీ దబంగ్ 3 మూవీని తీవ్రంగా విమరిస్తూ రివ్యూ ఇచ్చిన కమల్ ఆర్ ఖాన్ తన రివ్యూలతో సల్మాన్ ని వచ్చే మూడేళ్ళలో ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని ఆయన శబధం చేస్తున్నాడు. కమల్ ట్వీట్స్ పై సల్మాన్ ట్విట్టర్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు.

దీనికి స్పందనగా కమల్ మరో ట్వీట్ చేశారు. ఒక మూవీ బాగుందో లేదో చెప్పే హక్కు నాకుంది, అలాగే ఏ హీరో గురించైనా మాట్లాడే హక్కు నాకుంది. ఒక వేళ సల్మాన్ నా ట్వీట్స్ భరించలేకపోతే నాకు సారీ చెప్పి, రిక్వెస్ట్ చేస్తే వదిలేస్తా అని సల్మాన్ కి భారీ ఆఫర్ ఇస్తున్నాడు. బాలీవుడ్ లో వివాదాస్పద వ్యాఖ్యలతో అనేక మార్లు వార్తలకెక్కిన కమల్ ఆర్ ఖాన్ ని బాలీవుడ్ కొంతకాలం వెలివేసింది కూడా.

పైగా ఆయన ట్విట్టర్ ను కూడా బ్లాక్ చేయడం జరిగింది. తాజాగా ఆయన సల్మాన్ ని అతి దారుణంగా టార్గెట్ చేస్తూ సల్మాన్ అభిమానుల దృష్టిలో విలన్ లా తయారయ్యాడు. సల్మాన్ దబంగ్ 3 చిత్రానికి దారుణమైన రేటింగ్స్ వచ్చినప్పటికీ ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూళ్లు దక్కాయి.

https://twitter.com/kamaalrkhan/status/1210865840129761282?s=20

సంబంధిత సమాచారం

తాజా వార్తలు