సుశాంత్ బయోపిక్ తీసి వాళ్ళ బండారం బయటపెడతాడట.

సుశాంత్ బయోపిక్ తీసి వాళ్ళ బండారం బయటపెడతాడట.

Published on Jun 19, 2020 9:37 AM IST

kamal r khan

సుశాంత్ సింగ్ ఆత్మ హత్య అందరినీ షాక్ కి గురిచేయగా ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ అభిమాని సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక ఆత్మ హత్య కూడా చేసుకున్నారు. సుశాంత్ ఆత్మ హత్యపై బాలీవుడ్ లో పెద్ద వివాదమే నడుస్తుండగా ఆయన ఫ్యాన్స్ మాత్రం ఓ డిమాండ్ చేస్తున్నారు. సుశాంత్ చివరి చిత్రం దిల్ బిచారా. ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

మరి ఇంత వివాదం జరుగుతుంటే వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ఊరకనే ఉంటాడా. ఆయన ఏకంగా హీరో సుశాంత్ బయోపిక్ తెరపైకి తెచ్చాడు. సల్మాన్ ని భయంకరంగా ద్వేషించే కె ఆర్ కె సోషల్ మీడియాలో “ఒట్టేసి చెబుతున్నాను. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బయోపిక్ నిర్మిస్తాను. ఈ సినిమా ద్వారా సుశాంత్ మరణానికి కారణమైన నేరస్థులని బయటపెడతాను. బాలీవుడ్ ప్రజలని ద్వేషించడం నాకు చాలా ఇష్టం. సుశాంత్ కి న్యాయం జరగాలి” ని ట్వీట్ చేశాడు.

https://twitter.com/kamaalrkhan/status/1273516182046486528

సంబంధిత సమాచారం

తాజా వార్తలు