
సౌత్ ఇండియన్ లెజండ్రీ డైరెక్టర్స్ లో కె బాలచందర్ ఒకరు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ అయిన రజినీకాంత్ మరియు కమల్ హాసన్ లను సినీ పరిశ్రమకి పరిచయం చేసింది ఆయనే.. ఇటీవలే బాలచందర్ స్వర్గస్తులైనారు. ఆయన మొదటి పుట్టిన రోజు వార్షికోత్సవాన్ని పురష్కరించుకొని కమల్ హాసన్ తన గురువు అయిన కె బాలచందర్ పేరు మీద ఓ ట్రస్ట్ ని ప్రారంభించనున్నాడు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు చెన్నైలో కొన్ని కార్యక్రమాలను చేపట్టనున్నారు.
ఈ వేడుకల్లో చివరిగా కె బాలచందర్ నటించిన ఉత్తమ విలన్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు. అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది టాలెంట్ ఉన్నవారిని ప్రత్యేకంగా సత్కరించనున్నారు. అందులో భాగంగా మొదటి అవార్డ్ ను కొద్ది రోజుల క్రితమే కాక ముట్టై సినిమాతో తమిళ ప్రేక్షకులని మెప్పించిన మనికందన్ కి మొదటి అవార్డును అందజేయనున్నారు. ఈ వేడుకకి పాలూరు తమిళ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎంతో సన్నిహితంగా ఉండే తన గురువు కోసం ఇదంతా చేస్తున్నాడు.

