ఎస్.జె సూర్యకి జోడీగా కమలినీ ముఖర్జీ తమిళ్ రీ ఎంట్రీ

ఎస్.జె సూర్యకి జోడీగా కమలినీ ముఖర్జీ తమిళ్ రీ ఎంట్రీ

Published on Jun 17, 2015 7:22 PM IST

Kamalini-Mukherja
‘పిజ్జా’ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. తను తీసిన రెండవ సినిమా ‘జిగర్తాండ’ తమిళంలో మంచి హిట్ అవ్వడమే కాకుండా నేషనల్ అవార్డు ని కూడా తెచ్చిపెట్టింది. కార్తీక్ సుబ్బరాజు తమిళ యంగ్ హీరో విజయ్ సేతుపతి హీరోగా తన మూడవ సినిమాని మొదలు పెట్టారు. ఈ సినిమాకి ‘ఇరైవి’ అనే టైటిల్ ని పెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగమ్మాయి అంజలిని ఖరారు చేసారు.

తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా జాయిన్ అయ్యింది. తనే ఆనంద్, గోదావరి, గమ్యం, గోపి గోపిక గోదావరి సినిమాలతో పరిచయం ఉన్న కమలినీ ముఖర్జీ. దాదాపు 6 ఏళ్ళ తర్వాత కమలినీ ముఖర్జీ తమిళ్ లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు నటుడు, డైరెక్టర్ ఎస్.జె సూర్య, బాబీ సింహా, ఖాళీ వెంకట్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఎస్.జె సూర్య పాత్రకి జోడీగా కమలినీ ముఖర్జీ కనిపిచనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన 2వారాల షూటింగ్ ని కూడా కమలినీ ముఖర్జీ పూర్తి చేసింది.

తాజా వార్తలు