ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేసిన భారతీయుడు 2 !

Published on Jan 15, 2019 10:37 am IST

కమల్‌ హాసన్ – శంకర్‌ కలయికలో భారతీయుడు సీక్వెల్‌ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ఈ నెల 18నుండి వచ్చే ఏడాది జనవరిలో చెన్నైలో జరగనుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది. పోస్టర్ లో కమల్ హాసన్ వేళ్ళు మడత పెట్టిన విధానం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

మొత్తానికి టెక్ మాంత్రికుడు శంకర్ ఈ చిత్రాన్ని భారీ హంగులతోనే తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ సినిమాలో తెలుగు కమెడియన్ వెన్నల కిషోర్ కూడా ఓ కామిక్ పాత్రను చేయనున్నాడు. అలాగే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ్ హీరో శింబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది.

కమల్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది. 2020లో ఈ సినిమా సంక్రాంతికి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More