ఆకట్టుకుంటున్న ‘కనా’ ట్రైలర్ !

ఆకట్టుకుంటున్న ‘కనా’ ట్రైలర్ !

Published on Nov 25, 2018 4:10 PM IST

Kanna

ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో క్రికెట్ నేపథ్యంలో అరుణ్ రాజా కామరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కనా’. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇక ట్రైలర్ ఆసక్తికరంగా ఉండి చిత్రం ఫై అంచనాలు పెంచింది. ఒక గ్రామీణ మధ్య తరగతి అమ్మాయి ఆంతర్జాతీయ క్రికెటర్ గా ఎలా ఎదిగింది అనేదే ఈ చిత్ర కథ. ఈచిత్రంలో ఐశ్వర్య రాజేష్ లేడీ క్రికెటర్ పాత్రలో నటిస్తుండగా సత్యరాజ్ ఆమెకు తండ్రి గా కనిపించనున్నాడు. ఇప్పటివరకు మెన్స్ క్రికెట్ నేపథ్యంలో సినిమాలు వచ్చాయి కానీ సౌత్ లో ఫస్ట్ టైం ఉమెన్స్ క్రికెట్ నేపథ్యం లో రానున్న ఈ చిత్రం ఈ డిసెంబర్ లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు