క్రిష్ కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కంగనా !

Published on Feb 3, 2019 3:50 am IST


పోరాట యోధురాలు ‘రాణి లక్ష్మి భాయ్’ జీవిత చరిత్ర ఆదారంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో, తెరకెక్కిన ‘మణికర్ణిక’ చిత్రానికి మొదట
దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించినా ఆ తరువాత ఆయనకు, కంగనా రనౌత్ కు మధ్య వచ్చిన అభిప్రాయభేదాలు కారణంగా క్రిష్ ఆ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నారు. కాగా ఈ విషయం పై క్రిష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మణికర్ణిక సినిమాని తానే దర్శకత్వం వహించానని, అయిన కంగనా మళ్లీ కొన్ని సన్నివేశాలు రీషూట్ చేసిందని.. కంగనా పై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

అయితే క్రిష్ వ్యాఖ్యల పై తాజాగా కంగనా స్పందిస్తూ, “మణికర్ణిక’కు నేనే దర్శకత్వం వహించా. దీనిలో ఎటువంటి మార్పులేదు. ఒకవేళ క్రిష్ చెప్పేదే నిజమైతే నిరూపించుకోమని చెప్పండి. ఇక ‘నా పాత్రను తీసేశారు, కట్‌ చేశారు’ అని ఆరోపణలు చేసిన వారికి నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. నేను ఓ నటిగా, ఇప్పటివరకూ ఫిల్మ్‌మేకర్‌గా మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్నా. వీటిని నేను నా స్వతహాగా సాధించా. మీరూ కూడా ఈ స్థాయికి రావాలి కానీ ,మరొకర్ని చూసి ఏడిస్తే లాభం లేదు, అలా ఏడుస్తున్న వారందరిని పెట్టి క్రిష్ ను మళ్లీ సినిమా తీసుకొమ్మనండి” అని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత సమాచారం :