ఐశ్వర్య లుక్‌ పై విమర్శలు.. కంగనా కౌంటర్ !

ఐశ్వర్య లుక్‌ పై విమర్శలు.. కంగనా కౌంటర్ !

Published on May 25, 2026 5:03 PM IST

కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బాలీవుడ్‌ నటి ఐశ్వర్యారాయ్‌ తన ఫ్యాషన్‌ లుక్‌ తో కనిపించారు. పైగా తన కుమార్తె ఆరాధ్యతో కలిసి ఆమె రెడ్‌ కార్పెట్‌పై హొయలొలికించారు. అయితే, ఐశ్వర్య లుక్‌పై నెట్టింట కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై కంగనా రనౌత్‌ విరుచుకు పడ్డారు. ‘ఫ్యాషన్, స్టైల్ అనేది ఎవరికి నచ్చినట్లు వారు ఎంపిక చేసుకునేవి. ఈ విషయంలో ఏ మహిళ కూడా ఎవరికీ ఎటువంటి వివరణ ఇవ్వక్కర్లేదు. కేన్స్‌లో ఐశ్వర్య అద్భుతంగా ఉన్నారు’ అని కంగనా తెలిపింది.

కంగనా ఇంకా మాట్లాడుతూ.. ‘ఐశ్వర్యను మరేదైనా స్టైల్‌లో చూడాలనుకునే వారు, మొదట మీ దగ్గర ఏముందో ప్రపంచానికి చూపించండి. అప్పుడు మీకు అర్ధం అవుతుంది ?, ‘ఫ్యాషన్, స్టైల్ అనేది ఎంత కష్టమో. అయినా.. రెడ్‌కార్పెట్‌పై ఎప్పుడూ యువ నటీమణులే ఉండరు. ఇలా 50 ఏళ్లలో ఉన్నవారు కూడా ఉంటారు. ఒకవేళ వారిని చూడడం మీకు అలవాటు లేకపోతే, ఇకనైనా అలవాటు చేసుకోండి’ అని తన పోస్ట్‌లో కంగనా రాసుకొచ్చారు.

తాజా వార్తలు