వైరల్ అవుతున్న కంగనా కామెంట్స్

వైరల్ అవుతున్న కంగనా కామెంట్స్

Published on Feb 12, 2024 4:34 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘కంగనా రనౌత్’ వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఐతే, కంగనా రనౌత్ రీసెంట్‌గా రాజకీయాల పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాలీవుడ్ లో వైరల్ గా మారాయి. ఇంతకీ, కంగనా ఏం కామెంట్స్ చేసింది అంటే.. మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా ? అని అడిగితే.. ఈ ప్రశ్నకు కంగనా మాట్లాడుతూ ‘నేను రాజకీయ రంగానికి చెందిన వ్యక్తిని కాదు. కానీ, చాలా మంది రాజకీయాల్లోకి రావాలని నన్ను అడుగుతున్నారు. ఐతే, నేను రాజకీయాల్లోకి వెళ్లను’. అని కంగనా స్పష్టం చేసింది.

ఐతే, కొన్ని రోజుల క్రితం, కంగనా రనౌత్‌ తన కెరీర్ పై కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నా సినిమాల పై పెయిడ్ నెగిటివిటీ ఎక్కువగా ఉంది. కొందరు కావాలనే నన్ను తొక్క, డానికి ఇలా చేస్తున్నారు. వారితో నా పోరాటం ఆగదు. కానీ, ప్రేక్షకులు కూడా చెత్త సినిమాలనే ఇష్టపడుతూ రావడమే నన్ను ఎంతగానో బాధ పెడుతుంది. అందుకే, రాబోయే రోజుల్లో నేను నా కెరీర్ మార్చుకునే అవకాశం ఉంది’ అంటూ తాను రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నాను అని కంగనా రనౌత్ ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది. కానీ, ఇప్పుడు మళ్ళీ మాట మార్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు