కైరా అద్వానీపై ఫైర్ అయినా కంగనా సిస్టర్ !

Published on May 28, 2019 6:38 pm IST

చేతి నిండా సినిమాలతో హిందీ పరిశ్రమలో దూసుకుపోతోంది హీరోయిన్ కైరా అద్వానీ. ఆమె నటించిన ‘కబీర్ సింగ్’ విడుదలకు సిద్ధంగా ఉండగా ‘గుడ్ న్యూస్, షేర్ షా, లక్ష్మీ బాంబ్’ వంటి సినిమాల్లో ఆమె నటిస్తోంది. ఇవి కాకుండా నిన్ననే ‘ఇందూ కి జవానీ’ అనే కొత్త సినిమాను అనౌన్స్ చేసింది కైరా. అబిర్ సేన్ గుప్త ఈ చిత్రానికి దర్శకుడు. కంటెంట్ పరంగా సినిమా బోల్డ్ అని తెలుస్తోంది. ఇక సినిమాలో కైరా చేయనున్న ఇందూ పాత్ర ఇంకా బోల్డ్ తరహాలో ఉంటుందట.

ఇదే స్టార్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలికి నచ్చలేదు. ఒకవైపు మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఇంకోవైపు ఆడవారిని బొమ్మలుగా చూపే ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. సెన్సార్ బోర్డు గనుక ఈ చిత్రాన్ని అనుమతిస్తే మన ముఖాల మీద మనమే కొట్టుకున్నట్టు. భవిష్యత్ తరాలు మనల్ని చూసి సిగ్గుపడతాయి. ఇలాంటి సినిమాలు తీసే బాలీవుడ్ పరిశ్రమ రేపు వారి కూతుళ్ళ కళ్ళలోకి ఎలా చూడగలుగుతుంది అంటూ తెగ ఫైర్ అయింది. మరి ఈమె మాటకు కైరా అద్వానీ ఇంకా చిత్ర దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More