లైంగిక వేధింపులపై కంగనా మరోసారి సెన్సేషనల్ కామెంట్స్.!

Published on Sep 20, 2020 6:54 pm IST

ఇప్పుడు బాలీవుడ్ సినీ వర్గాల్లో లేటెస్ట్ సెన్సేషన్ కంగనా రనౌత్ ఏం మాట్లాడినా అది ఎటు దారి తీస్తుందో అన్నది హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత నుంచి బాలీవుడ్ వర్గాలపై స్వరం పెంచిన కంగనా అక్కడ జరిగే లైంగిక వేధింపులు కోసం కూడా మాట్లాడ్డం ప్రారంభించడంతో అక్కడి వాతావరణం మరింత వేడెక్కింది. ఇదిలా ఉండగా ఇటీవలే పాయల్ ఘోష్ తనను బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైంగిక వేధింపులకు గురి చేసాడని చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.

ఇపుడు ఆమె విషయంపైనే కంగనా మరిన్ని హాట్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. పాయల్ ఘోష్ కు జరిగినట్టుగానే తనతో కూడా చాలా మంచి బాలీవుడ్ బడా హీరోలు ప్రవర్తించారని, ఏదన్నా వాన్ డోర్ కానీ రూమ్ తలుపులు కానీ లాక్ అయ్యినప్పుడో పార్టీలలో ఫ్రెండ్లీ డాన్స్ చేసినపుడో సడన్ గా వారికి జ్ఞ్యానేంద్రియాలు అన్ని ఫ్లాష్ అయ్యిపోతాయని బాలీవుడ్ మొత్తం అబద్దపు పెళ్లిళ్లు చేసుకున్న లైంగిక మృగాలతో నిండిపోయి ఉందని అలాంటి వారిని నా స్టైల్ లో అడ్డుకున్నానని” కంగనా మరోసారి సంచలనం రేపింది.

సంబంధిత సమాచారం :

More