అంత కష్టం ఉంది కాబట్టే ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారు

Published on Sep 20, 2019 6:35 pm IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ సన్నాహాల్లో ఉంది. సినిమాలో భిన్నమైన వయసుల్లో కనిపించాల్సి ఉండటంతో ఆమె లుక్ టెస్ట్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లారు. అక్కడే హాలీవుడ్ ఫేమస్ ప్రోస్తెటిక్ ఆర్టిస్ట్ జేసన్ కోలిన్స్‌ నేతృత్వంలోఅతి క్లిష్టమైన ప్రోస్తెటిక్ మెజెర్మెంట్స్ తీసుకుంటున్నారు.

ఈ తతంగం చాలా కష్టంతో కూడుకున్నది. ముఖం, శరీరం నిండా ప్రోస్తెటిక్ లిక్విడ్స్ వేసుకుని గంటల తరబడి కూర్చొని ఉండాలి. అలా కావాల్సిన మెజెర్మెంట్స్ వచ్చే వరకు చేయాల్సి ఉంటుంది. ఇంత కష్టం ఉంది కాబట్టే కంగనాకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ముట్టజెబుతున్నారు నిర్మాతలు. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ‘తలైవి’గా వస్తున్న ఈ చిత్రం హిందీలో ‘జయ’ పేరుతో రిలీజవుతుంది.

సంబంధిత సమాచారం :

X
More