మ‌ర్డ‌ర్ కేసులో స్టార్ హీరో ద‌ర్శ‌న్ అరెస్ట్

మ‌ర్డ‌ర్ కేసులో స్టార్ హీరో ద‌ర్శ‌న్ అరెస్ట్

Published on Jun 11, 2024 11:10 AM IST

క‌న్న‌డ స్టార్ హీరో, ‘ఛాలెంజింగ్ స్టార్’ దర్శ‌న్ ను క‌ర్ణాట‌క పోలీసులు అరెస్ట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. మైసూరు పోలీసులు ఆయ‌న్ను తాజాగా అదుపులోకి తీసుకున్న‌ట్లు శాండిల్ వుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఓ మ‌ర్డ‌ర్ కేసులో ద‌ర్శ‌న్ ను పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

రేణుక స్వామి అనే వ్య‌క్తి మ‌ర్డ‌ర్ కేసులో న‌టుడు ద‌ర్శ‌న్ తో పాటు మ‌రో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. న‌టి ప‌విత్ర గౌడ‌కు అస‌భ్య‌క‌ర‌మైన మెసేజ్ లు పంప‌డం, సోష‌ల్ మీడియాలో ఆమెపై కామెంట్స్ చేయ‌డంతో రేణుక స్వామిని గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు హ‌త‌మార్చిన‌ట్లుగా పోలీసులు తెలిపారు. అయితే, ప‌విత్ర గౌడకు చెందిన ఓ షెడ్ లో రేణుక స్వామి హ‌త్య జ‌రిగిన‌ట్లుగా పోలీసులు గుర్తించారు.

దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న‌ట్లుగా అనుమానిస్తున్న 10 మందితో పాటు న‌టుడు ద‌ర్శ‌న్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, గ‌తంలో ద‌ర్శ‌న్, ప‌విత్ర గౌడ ల మ‌ధ్య అఫైర్ ఉన్న‌ట్లుగా పుకార్లు వ‌చ్చాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు