చరణ్ తేజ్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆయుష్మాన్ భవ’. సిటిఎఫ్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మారుతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘నేను లోకల్’ చిత్ర దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన స్టోరి, దర్శకత్వ పర్యవేక్షణలో, ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ కథనం తో రూపొందుతుంది ఈ చిత్రం. ఇక మీట్ బ్రోస్ సంగీతం అందిస్తున్నాఈ చిత్రం లో స్నేహ ఉల్లాల్ ,ఆండ్రియా. హుజాన్ , రన్యా రావ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
కన్నడ నటి రన్యా రావ్ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది. ఇందులో ఆమె మోడ్రన్ సావిత్రిగా కనిపించనుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది.
