జపాన్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఎమోషనల్ కన్నడ చిత్రం

జపాన్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఎమోషనల్ కన్నడ చిత్రం

Published on Apr 28, 2024 8:03 AM IST

ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర మళయాళ చిత్రాలు ఎలా షైన్ అవుతున్నాయో చూస్తున్నాము. అయితే గత కొన్ని నెలలు కితం కన్నడ చిత్రాలు బాగా ఇంప్రెస్ చేసాయి. “కాంతార”, “సప్త సాగరాలు దాటి” లాంటి సినిమాలు బాగా ఇంప్రెస్ చేయగా వీటితో పాటుగా నటుడు రక్షిత్ శెట్టి నటించిన మరో ఎమోషనల్ డ్రామా “777 చార్లీ” కూడా ఒకటి.

దర్శకుడు కిరణ్ రాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం మనిషికి ఓ కుక్కకు ఉండే ఎమోషనల్ బాండ్ ని అద్భుతంగా చూపించి అమితంగా ఆకట్టుకుంటుంది. మరి కన్నడలో పెద్ద హిట్ అయ్యిన ఈ చిత్రం తర్వాత తెలుగులో రిలీజ్ అయ్యి తెలుగు ఆడియెన్స్ ని కూడా మెప్పించింది.

అయితే ఈ సినిమా ఇప్పుడు జపాన్ దేశంలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. జపాన్ లో కూడా అదే టైటిల్ తో ఈ జూన్ 28న రిలీజ్ కానున్నట్టుగా ఇప్పుడు డేట్ ఫిక్స్ చేసుకుంది. మరి ఈ చిత్రాన్ని జపాన్ లో పేరు మోసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ షోచికు మూవీ వారు రిలీస్ చేస్తున్నారు. ఇక జపాన్ ప్రేక్షకులు ఈ ఎమోషనల్ చిత్రానికి ఎలాంటి ఆదరణ ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు