పవన్ కల్యాణ్ ను కలిసిన కన్నడ స్టార్ హీరో !

పవన్ కల్యాణ్ ను కలిసిన కన్నడ స్టార్ హీరో !

Published on Oct 5, 2020 5:39 PM IST

pawan Kichcha Sudeep

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారిని ప్రముఖ నటులు, కన్నడ కథానాయకుడు శ్రీ సుదీప్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని శ్రీ పవన్ కల్యాణ్ గారి కార్యాలయానికి శ్రీ సుదీప్ గారు వచ్చారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారికి మొక్కలు బహూకరించారు. వారిద్దరి మధ్య సుమారు గంట సేపు సంభాషణ సాగింది. కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి శ్రీ సుదీప్ గారు వివరించారు. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటంటే… ఇద్దరి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ కావడం విశేషం.

తాజా వార్తలు