‘పెద్ది’ ట్రైలర్ పై రిషబ్ శెట్టి.. చరణ్, శివన్నలపై ప్రశంసల వర్షం!

‘పెద్ది’ ట్రైలర్ పై రిషబ్ శెట్టి.. చరణ్, శివన్నలపై ప్రశంసల వర్షం!

Published on May 19, 2026 12:13 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మల్టీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం పెద్ది కూడా ఒకటి. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ మంచి స్పందన అందుకుంది. ఇక దీనిపై కన్నడ స్టార్ నటుడు కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ప్రశంసలు కురిపించడం వైరల్ గా మారింది.

పెద్ది ట్రైలర్ అద్భుతంగా ఉంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతీ ఫ్రేమ్ లో ఫైర్ చూపిస్తూ స్టన్నింగ్ గా ఉన్నాడు అలాగే శివ రాజ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్ లో మరింత ఇంపాక్ట్ చూపిస్తుంది అని తెలిపారు. అలాగే జాన్వీ కపూర్ అందంగా కనిపిస్తుంది. బుచ్చిబాబు ఎక్సలెంట్ వర్క్ అందించారు అంటూ సినిమా యూనిట్ అందరికీ తన బెస్ట్ విషెస్ ని అందించారు. దీనితో పెద్ది సినిమా ట్రైలర్ పై రిషబ్ రెస్పాన్స్ ఇపుడు వైరల్ గా మారింది.

తాజా వార్తలు