కపిల్ దేవ్ బయోపిక్ విడుదల ఎప్పుడంటే !

కపిల్ దేవ్ బయోపిక్ విడుదల ఎప్పుడంటే !

Published on Jul 5, 2018 11:25 PM IST

kapildev2

బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు ఖబీర్ ఖాన్ తెరకెక్కించనున్న చిత్రం ’83’. గ్రేట్ క్రికెట్ ప్లేయర్ టీమిండియా మాజీ కేప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథతో తెరకెక్కనుంది ఈ చిత్రం. ఇక ఈ చిత్రంలో ఆయన బాల్యం తో పాటు 1983 ప్రపంచ కప్ ను గెలవడం లో ఎలాంటి పాత్ర పోషించారనే విషయాలను చూపించనున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేశారు.

2020లో ఏప్రిల్ 10 గుడ్ ఫ్రైడే రోజు ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో రన్వీర్ కు కోచ్ గా నటించనున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని ‘ఎన్టీఆర్ బయోపిక్’ నిర్మాత విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు