“సాహో” తో సమరానికి సై అంటున్న సూర్య

“సాహో” తో సమరానికి సై అంటున్న సూర్య

Published on Jul 31, 2019 10:16 AM IST


భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్ర విడుదల తేదీ మార్పు చాలా నిర్మాతలకు తలనొప్పిగా మారింది. ఆగస్టు 15న సాహో వస్తుందన్న నేపథ్యంలో కొందరు నిర్మాతలు తమ సినిమాల విడుదలను ఆగస్టు 30గా ఖరారు చేసుకున్నారు. వాటిలో నాని ‘గ్యాంగ్ లీడర్’ తోపాటు, సూర్య నటించిన ‘బందోబస్త్’ చిత్రాలు ఉన్నాయి. ఇప్పటికే నాని ‘గ్యాంగ్ లీడర్’ చిత్ర విడుదల తేదీ మారనున్నట్లు సమాచారం ఉంది. కాగా ‘బందోబస్త్’ చిత్ర విడుదల తేదీ కూడా మార్చుతారా లేక అదే రోజున విడుదల చేస్తారా? అనే అనుమానాలు ప్రముఖంగా వినిపిస్తున్న తరుణంలో దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది.

తమిళ చిత్రం ‘కప్పన్’ కి ‘బందోబస్త్’ తెలుగు డబ్బింగ్ వర్షన్ అన్న సంగతి తెలిసిందే. మోహన్ లాల్, ఆర్య,సయేశా,బోమన్ ఇరానీ వంటి ముఖ్య తారాగణంతో ‘కప్పన్’ కూడా భారీ ఎత్తున నిర్మించారు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. కాగా తమ చిత్రాన్ని అనుకున్న ప్రకారం ఆగస్టు 30 నే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ‘సాహో’ విడుదల కారణంగా ‘కప్పన్’ చిత్ర విడుదల వాయిదా వేసే ఆలోచన మాకులేదంటూ వారు ధ్రువీకరించడం జరిగింది.

దీనితో ఈ రెండు భారీ యాక్షన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద యుద్దానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. ‘సాహో’ తెలుగు,హిందీ,మలయాళంలో పాటు తమిళంలో కూడా విడుదలవుతుండగా, ‘కప్పన్’ తమిళ,తెలుగు భాషలలో విడుదల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు