విజయ్ కి కరణ్ జోహార్ భారీ ఆఫర్?

Published on Mar 6, 2020 8:39 am IST

విజయ్ దేవరకొండ ఇప్పటివరకు ఒక్క హిందీ చిత్రంలో నటించలేదు. అయినప్పటికీ అక్కడ విజయ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలలో విజయ్ టాలీవుడ్ ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇక బాలీవుడ్ బడా దర్శక నిర్మాత కరణ్ జోహార్ విజయ్ తో సినిమా చేయాలని ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ – విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీలో కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఐతే కరణ్ విజయ్ కి మరో భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

విజయ్ తో కొన్ని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కొరకు కరణ్ జోహార్ 100 కోట్ల ఆఫర్ ఇచ్చాడని తెలుస్తుంది. ఈ ఆఫర్ కనుక విజయ్ ఒప్పుకుంటే విజయ్ తో వరుసగా సినిమాలు తీసి హిందీ, తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల చేయాలని చూస్తున్నాడట. మరి ఇదే నిజమైతే విజయ్ పంట పండినట్లే అంటున్నారు. ఇక ప్రస్తుతం పూరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు విజయ్. ఈ చిత్రంలో ఓ ప్రొఫెషనల్ ఫైటర్ గా విజయ్ కనిపిస్తుండగా పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మి నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :

More