హిందీ ‘జేజమ్మ’గా కరీనా కపూర్

హిందీ ‘జేజమ్మ’గా కరీనా కపూర్

Published on Apr 23, 2012 11:00 AM IST


2009 సంవత్సరంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అరుంధతి సినిమాలోని ‘జేజమ్మ’ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ జేజమ్మ పాత్ర పోషించిన అనుష్కకు ఆ తరువాత ఎంతటి క్రేజ్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో తీయబోతున్నారు. మరి హిందీ జేజమ్మ ఎవరు అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు కరీనా కపూర్. ఈ చిత్రానికి సంభందించిన హిందీ రీమేక్ జెమిని ఫిల్మ్స్ వారు దక్కించుకోగా జేజమ్మ పాత్ర కోసం మొదటగా ఐశ్వర్య రాయ్, కత్రిన కైఫ్ పేరు అనుకున్నప్పటికీ చివరగా కరీనా కపూర్ పేరును ఖరారు చేసారు. తెలుగులో ఈ చిత్రాన్ని మల్లెమాల ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. రాహుల్ నంబియార్ అందించిన స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు