“టాక్సిక్” లో కరీనా కపూర్ షాకింగ్ రోల్!?

“టాక్సిక్” లో కరీనా కపూర్ షాకింగ్ రోల్!?

Published on Mar 27, 2024 3:34 PM IST

కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) ప్రధాన పాత్రలో, గీతు మోహన్ దాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్. ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రం లో యశ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది అని అంతా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం లో కరీనా కపూర్ ది హీరోయిన్ రోల్ కాదట.

ఈ చిత్రం లో యశ్ కి సిస్టర్ రోల్ లో కరీనా కపూర్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. కరీనా కపూర్ రోల్ ఇందులో చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది అని, ఇప్పటి వరకు చేయని పవర్ ఫుల్ రోల్ అంటూ కొందరు చెబుతున్నారు. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు