ఈ నెల 29న “కర్మయోగి” మోషన్ పోస్టర్ !

karma

గగన్ నవిత ఘంగాత్ హీరో హీరోయిన్స్ గా బోలా శంకర్ క్రియేషన్స్ పతాకంపై డా,, ప్రసాద్ కంభం నిర్మాతగా రాజ భూపతి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “కర్మయోగి” ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ వైజాగ్ అరకు పరిసర ప్రాంతాల్లో జరుపుకుని రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

కాగా త్వరలో మిగతా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకులముందుకి రానుంది మా “కర్మయోగి” అని చిత్ర యూనిట్ తెలిపారు. ఇక ఈ సినిమాలో నటి నటులు గగన్, నవిత ఘంగాత్, ధను, మధుప్రియ తదితరులు నటిస్తున్నారు. ఇక టెక్నిషియన్స్ విషయానికి వస్తే.. కెమెరా: జి. అమర్, సంగీతం: ప్రణవ్, నిర్మాత: డా,, ప్రసాద్ కంభం, కథ,స్క్రిప్ట్ ప్లే, దర్శకత్వం: రాజ భూపతి.

Exit mobile version