ఓటిటిలో డైరెక్ట్ స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘అన్నగారు వస్తారు’

Annagaru Vostaru

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు నలన్ కుమారస్వామి తెరకెక్కించిన ఇంట్రస్టింగ్ చిత్రమే ‘అన్నగారు వస్తారు’ (Annagaru Vostaru). అయితే ఒరిజినల్ గా ఈ సినిమా ‘వా వాథియర్’ అంటూ తమిళ్ లో రీసెంట్ గానే విడుదల అయ్యింది. తెలుగులో కూడా థియేటర్స్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత థియేటర్స్ లో తెలుగు వెర్షన్ రాలేదు.

అయితే ఈ సినిమా ఫైనల్ గా ఓటిటిలో డైరెక్ట్ గా తెలుగు స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకోగా నేటి నుంచి ఒరిజినల్ తమిళ్ తో పాటుగా తెలుగు, ఇతర పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా రిలీజ్ కి వచ్చేసింది. ఇక ఒరిజినల్ గా అయితే కేవలం 2 వారాల్లోనే ఈ సినిమా వచ్చేయడం గమనార్హం. సో అప్పుడు ఈ సినిమా చూడని వారు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా స్టూడియో గ్రీన్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version