కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా నటించిన అవైటెడ్ సీక్వెల్ సినిమానే సర్దార్ 2. దర్శకుడు పి ఎస్ మిత్రన్ తెరకెక్కించిన ఈ సాలిడ్ స్పై యాక్షన్ డ్రామా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇది కాకుండా తెలుగు, తమిళ్ ఆడియెన్స్ ఎదురు చూస్తున్న మరో క్రేజీ సీక్వెల్ సినిమానే ఖైదీ 2.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో రావాల్సిన ఈ సినిమా ఎన్నో ఏళ్ళు తరవాత వెయిటింగ్ లో ఉండిపోయింది. అయితే దీనిపై నిన్న సర్దార్ 2 ఈవెంట్ లో కార్తీ మాట్లాడడం జరిగింది. ఖైదీ 2 కూడా ఉందని కానీ ముందు సర్దార్ 2 చూడాలని తెలిపాడు. కానీ ఖైదీ 2 కోసం చెప్పిన సమయంలో తనలో అంత కాన్ఫిడెన్స్ కనిపించలేదు. దీనితో లోకేష్ కనగరాజ్ తో దూరం ఇంకా అలానే ఉందా అని అనిపిస్తుంది. సో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందో వేచి చూడాల్సిందే.
