కార్తీ స్పీడ్ మాములుగా లేదే..!

కార్తీ స్పీడ్ మాములుగా లేదే..!

Published on Nov 29, 2019 10:55 AM IST

Karthi2

కార్తీ ఖైదీ సందడి థియేటర్స్ లో ముగియక ముందే, దొంగ గా వచ్చేశాడు.ఈ చిత్రంలో ఆఫ్ స్క్రీన్ వదిన అయిన జ్యోతిక ఆన్ స్క్రీన్ అక్కగా చేస్తుంది. తమిళంలో తంబీ గా విడుదల అవుతుండగా తెలుగులో దొంగ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవలే విడుదలైన దొంగ టీజర్ సినిమా పై ఆసక్తి రేపేదిలా ఉంది. చిన్నప్పుడే ఇంటి నుండి పారిపోయి దొంగగా మారిన తమ్ముడు అక్క కష్టాలు తీర్చడానికి ఎలా మంచిగా మారాడు అనేది ప్రధాన కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కిందని సమాచారం.

కాగా ఈ చిత్ర ఆడియో సాంగ్స్ రేపు విడుదల కానున్నాయి. గోవింద వసంత ఈ చిత్రానికి సంగీతం అందించారు. గతంలో ఈయన సూపర్ హిట్ మూవీ 96కి సంగీత దర్శకుడిగా పనిచేశారు. అలాగే ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుందని తెలుస్తుంది. సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్టు సమాచారం. వచ్చే నెల డిసెంబర్ 27న దొంగ చిత్రం విడుదల కానుంది. దొంగ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇక రష్మిక హీరోయిన్ గా భాగ్యరాజ్ కన్నన్ డైరెక్షన్ లో సుల్తాన్ అనే మరో మూవీ కార్తీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు