కోలీవుడ్ స్టార్ నటుడు కార్తీ హీరోగా మాళవిక మోహనన్ అలాగే ఆశిక రంగనాథ్ లు హీరోయిన్స్ గా దర్శకుడు పి ఎస్ మిత్రన్ తెరకెక్కించిన అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ నే సర్దార్ 2. పార్ట్1 తెలుగు, తమిళ్ లో పెద్ద హిట్ అయ్యింది. దీనితో అనౌన్స్ చేసిన పార్ట్ 2 పై మొదట మంచి అంచనాలు నెలకొన్నాయి.
కానీ తర్వాత పరిస్థితులు నెమ్మదించడంతో అంచనాలు అలాగే నీరు గారాయి. ఫైనల్ గా సినిమా పెద్దగా బజ్ లేకుండానే థియేటర్స్ లో విడుదల అయ్యి ప్లాప్ గా నిలిచింది. ఇక అక్కడ నుంచి మూడే వారాలకి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నారు.
ఇక ఇందులో నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. సో ఈ సినిమా అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకుంటే చూడొచ్చు. ఇక ఈ సినిమాకి సామ్ సి ఎస్ సంగీతం అందించగా ఐ వి వై ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి


