కోలీవుడ్ స్టార్ నటుడు కార్తీ హీరోగా నటించిన ఈ ఏడాది సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ గానే నిలిచాయి. అయితే ఈ సినిమాల్లో దర్శకుడు పి ఎస్ మిత్రన్ తెరకెక్కించిన భారీ సీక్వెల్ సినిమా ‘సర్దార్ 2’ కూడా ఒకటి. ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన మొదటి సినిమా తెలుగు, తమిళ్ లో అదరగొట్టింది.
కానీ పార్ట్ 2 మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యింది. ఇలా ప్లాప్ గానే మిగిలిపోయిన ఈ సినిమా కేవలం మూడే వారాలకి ఓటిటిలోకి వచ్చేసింది. ఈ సినిమాని పాపులర్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇటీవల పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేసారు. అయితే ఇక్కడ మాత్రం సినిమా అదరగొడుతుంది. ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఈ సినిమా టాప్ 1 లో ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం.
థియేటర్స్ లో పెద్దగా పట్టించుకోని ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కి ఓటిటిలో ఈ రేంజ్ స్పందన ఇంత తక్కువ సమయంలోనే రావడం ఇంట్రెస్టింగ్ అనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో ఆషిక రంగనాథ్, మాళవిక మోహనన్, ఎస్ జె సూర్య తదితరులు నటించగా ప్రిన్స్ పిక్చర్స్ నిర్మాణం వహించారు.



