హీరోకి ఆ చిత్రం తరువాత లారీ డ్రైవర్లపై గౌరవం పెరిగిందట

హీరోకి ఆ చిత్రం తరువాత లారీ డ్రైవర్లపై గౌరవం పెరిగిందట

Published on Oct 22, 2019 5:22 PM IST

ఖైదీ చిత్రం దీపావళి కానుకగా మరో మూడురోజులలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. పరారీ ఖైదీగా రా అండ్ రియలిస్టిక్ గెటప్ లో కార్తీ అలరిస్తున్నారు. వైవిధ్యమైన కథతో ప్రయోగాత్మకంగా ఖైదీ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించారు. మూవీ మొత్తం నాలుగు గంటలు ఉత్కంఠగా సాగే ఒక రాత్రి నేపథ్యంలో కావడం విశేషం. ఒక్క డేషాట్ కూడా ఈ చిత్రంలో ఉండదు. సినిమా మొత్తం చీకటిలోనే గడచిపోతుంది.

కాగా ఈ మూవీ ప్రొమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న కార్తీ లారీ డ్రైవర్స్ గురించి స్పందించారు. సీటు బెల్టు లేకుండా, ఎటువంటి భద్రతా ప్రమాణాలు లేకుండా వందల కిలోమీటర్లు ప్రయాణించే లారీ డ్రైవర్స్ కష్టం మరువరానిది అన్నారు. ఈ చిత్రం తరువాత నాకు లారీ డ్రైవర్స్ పై గౌరవం పెరిగింది అన్నారు. ఖైదీ చిత్రంలో కార్తీ పోలీసులనుండి అలాగే రౌడీ గ్యాంగ్ నుండి తప్పించుకోవడానికి లారీలో పారిపోతాడు. ఈ సన్నివేశాల కొరకు కార్తీ స్వయంగా చాలా గంటలు లారీ నడిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు