కార్తీ ఖైదీ ట్రైలర్ సిద్ధం చేశాడు

కార్తీ ఖైదీ ట్రైలర్ సిద్ధం చేశాడు

Published on Oct 12, 2019 11:00 PM IST

karthi

తెలుగులో మంచి మార్కెట్ ఉన్న హీరోలలో హీరో కార్తీ ఒకరు. యుగానికి ఒక్కడు, నాపేరు శివ, ఆవారా వంటి చిత్రాలు ఆయనకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కాగా కార్తీ చేస్తున్న తాజా చిత్రం ఖైదీ. నగరం వంటి ప్రయోగాత్మక చిత్రం తీసిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఖైదీ చిత్రం కూడా ఆయన వైవిధ్యంగా తెరకెక్కించారు. ఈ మూవీ కథ మొత్తం ఒక రాత్రి నేపథ్యంలో నడుస్తుంది. అసలు డే షాట్ నే ఈ మూవీలో ఉండకపోవడం గమనార్హం.

జైలు నుండి తప్పించుకున్న ఖైదీగా కార్తీక్ నటిస్తుండగా, ఒకవైపు పోలీసులు, మరోవైపు రౌడీ ముఠా అతని కోసం వెతుకుతూ ఉంటారు. ఈ మూవీలో పాటలు, మరియు హీరోయిన్ కూడా ఉండదని సమాచారం. కాగా ఈ మూవీ ట్రైలర్ కి డేట్ ఫిక్స్ చేశారు. సోమవారం ఉదయం 10:25 నిమిషాలకు ఖైదీ ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈమేరకు పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఖైదీ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు