“కార్తీక దీపం” ఫ్రెష్ ప్రోమో.. సరికొత్త నేపథ్యం రివీల్

“కార్తీక దీపం” ఫ్రెష్ ప్రోమో.. సరికొత్త నేపథ్యం రివీల్

Published on Feb 25, 2024 10:16 AM IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి సీరియల్స్ లో స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అయ్యిన సెన్సేషనల్ రేటింగ్స్ సీరియల్ “కార్తీక దీపం” కూడా ఒకటి. నటీనటులు నిరుపమ్ అలాగే మళయాళ నటి ప్రేమి విశ్వనాథ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ ధారావాహిక భారీ రేటింగ్స్ తో అదరగొట్టి కంప్లీట్ చేసుకుంది.

అయితే దీనికి సీక్వెల్ ని కూడా అప్పుడు మేకర్స్ కన్ఫర్మ్ చేయగా రీసెంట్ గానే మళ్ళీ ఈ సీరియల్ ని స్టార్ట్ చేస్తున్నట్టుగా ప్రోమోస్ స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడు స్టార్ మా నుంచి లేటెస్ట్ ప్రోమో ఒకటి విడుదల చేశారు. అయితే ఇందులో ఈసారి నేపథ్యం ఎలా ఉంటుందో అనేది కనిపిస్తుంది.

నిరుపమ్ దగ్గర పని చేస్తున్న వంటమనిషిలా దీప కనిపిస్తుండగా ఆమె కూతురు శౌర్య తన తండ్రి కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ కార్తీక్ పాత్రకి వారికి ఎలాంటి సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది. ఒకింత కొత్త నేపథ్యంలోనే పాత కథకి పెద్దగా కనెక్షన్ లేకుండానే ఈ సీరియల్ ఉండేలా ఉందని చెప్పాలి. మరి దీనికి ఈసారి ఈ సీరియల్ అభిమానులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. ఇక ఈ సీరియల్ అతి త్వరలోనే స్టార్ట్ కానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు