‘కార్తికేయ – 2 ‘లో స్వాతి రోల్ లేదా ?

‘కార్తికేయ – 2 ‘లో స్వాతి రోల్ లేదా ?

Published on Jan 3, 2020 3:00 AM IST

Swathi Reddy

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ – 2 ‘ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి భాగంలో ప్రధాన పాత్ర పోషించిన కలర్స్ స్వాతి ఈ చిత్రంలో టీవీ రిపోర్టర్‌ గా కనిపిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో అసలు స్వాతి రోల్ లేదని ఆమె నటించట్లేదని తెలుస్తోంది. ఇక చిత్రబృందం ఈ సినిమా హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారట. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.

కాగా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. పైగా సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగు ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఇక ఈ చిత్రంలోని ఇతర నటీనటులు మరియు సాంకేతికవర్గానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు