20 కోట్లు వసూలు చేసిన ‘కార్తికేయ’

20 కోట్లు వసూలు చేసిన ‘కార్తికేయ’

Published on Nov 11, 2014 6:05 PM IST

Karthikeya
నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కార్తికేయ. ‘మాగ్నస్ సినీ ప్రైమ్’ పతాకంపై వెంకట్ శ్రీనివాస్ బొగ్గారం నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 24న విడుదలైంది. విడుదలైన 19 రోజులలో ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించి విజయ కేతనం ఎగురవేసింది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ సభ్యులు మంగళవారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. దర్శకనిర్మాతలతో పాటు హీరో నిఖిల్, చిత్ర సమర్పకులు శిరువురి రాజేష్ వర్మ, మీనా, సత్య, శివకుమార్, ఫణి. జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో నిఖిల్ మాట్లాడుతూ.. ప్రయోగాత్మక సినిమాలకు కలెక్షన్స్ రాబట్టలేవని ఎప్పటి నుండో ఒక విమర్శ ఉంది. మా సినిమాకు విమర్శకుల ప్రసంశలతో పాటు ప్రేక్షకుల ఆదరణ లభించింది. విడుదలైన మూడవ వారం తర్వాత కూడా 150 ధియేటర్లలో సినిమాను విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ లు హ్యాపీగా ఉన్నారు. పెద్ద సినిమా రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. నా కెరీర్ లో ‘కార్తికేయ’ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అగ్ర దర్శకులు, హీరోలు, నిర్మాతల నుండి ఫోన్ చేసి సినిమా బాగుందంటూ మెచ్చుకున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ స్టొరీ, డిఫరెంట్ ఐడియాలతో మరిన్ని సినిమాలు రావాలి. ‘కార్తికేయ’ తర్వాత ‘సూర్య vs సూర్య’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాలో నటిస్తున్నాను. అని అన్నారు.

నిర్మాత వెంకట్ శ్రీనివాస్ బొగ్గారం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేసిన శిరువురి రాజేష్ వర్మ గారికి థాంక్స్. చందు మొండేటి క్లారిటీ ఉన్న దర్శకుడు. కథను చెప్పిన విధంగానే సినిమాను తెరకెక్కించాడు. ఇంతటి హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.

19 రోజులలో ప్రపంచవ్యాప్తంగా ‘కార్తికేయ’ సినిమా 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది అని చిత్ర సమర్పకులు, డిస్ట్రిబ్యూటర్ శిరువురి రాజేష్ వర్మ తెలిపారు.

తాజా వార్తలు