ఇది నాలుగో సినిమా.. కుర్ర హీరోకి బ్రేక్ దొరుకుతుందా ?

ఇది నాలుగో సినిమా.. కుర్ర హీరోకి బ్రేక్ దొరుకుతుందా ?

Published on Dec 5, 2019 10:29 PM IST

గతేడాది ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువహీరో కార్తికేయ గుమ్మకొండకు ఈ 2019 పెద్దగా కలిసి రాలేదు. వరుసపెట్టి సినిమాలు చేసినా సాలిడ్ హిట్ దొరకలేదు. ఈ సంవత్సరం ఈ హీరోకు ‘హిప్పి, గుణ 369’ లాంటి సినిమాలు నిరుత్సాహాన్ని మిగల్చగా, ప్రతినాయకుడిగా మారి చేసిన నాని యొక్క ‘గ్యాంగ్ లీడర్’ బాగా పెర్ఫార్మ్ చేశాడనే పేరు వచ్చింది కానీ గుర్తుండిపోయే విజయమైతే లభించలేదు.

ఈ యేడాదిలో అయన చేసిన నాలుగో చిత్రం ’90 ఎంఎల్’ రేపు విడుదలకానుంది. ఈ చిత్రంతో ఎలాగైనా 2019ని శుభం కార్డుతో ముగించాలని చూస్తున్నాడు కార్తికేయ. ఇప్పటికైతే సినిమాపై పాజిటివ్ బజ్ ఉండగా రేపు 6వ తేదీ మార్నింగ్ షో టాక్ బాగుంటే సినిమా విజయం సాధించే అవకాశం ఉంది. మరి ఈ యువ హీరోకు ఈ డిసెంబర్ నెల కలిసొస్తుందో లేదో చూడాలి. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు శేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు