ఇంట్రెస్టింగ్ గా సాలిడ్ యాక్షన్ తో “భజే వాయు వేగం” ట్రైలర్.!

ఇంట్రెస్టింగ్ గా సాలిడ్ యాక్షన్ తో “భజే వాయు వేగం” ట్రైలర్.!

Published on May 25, 2024 12:40 PM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అలాగే విలన్ గాను మెప్పొంచగలిగే నటుడు కార్తికేయ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “భజే వాయు వేగం”. డెబ్యూ దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ అయితే మంచి ఆసక్తి గా యాక్షన్ లవర్స్ కి ఫీస్ట్ లా అనిపిస్తోంది.

అత్యవసర పరిస్థితుల్లో డబ్బు చుట్టూ తిరిగే కథలా ఈ ట్రైలర్ లో విజువల్స్ బాగున్నాయి. అలాగే కార్తికేయ అయితే తన రోల్ లో అదిరిపోయాడు అని చెప్పాలి. ఇంట్రెస్టింగ్ మెయిన్ గా తనపై యాక్షన్ సీన్స్ బాగున్నాయి. వీటిని మాత్రం దర్శకుడు గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడని చెప్పాలి అలాగే నటుడు రవి శంకర్ పాత్ర నెగిటివ్ షేడ్ లో ఆకట్టుకునేలా అనిపిస్తుంది.

ఇంకా ఈ ట్రైలర్ లో మంచి అంశం కపిల్ కుమార్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. టీజర్ కి చేసిన మిస్టేక్ లేకుండా తన స్కోర్ తో ట్రైలర్ కి మేజర్ ప్లస్ గా నిలిచాడు. అలాగే ట్రైలర్ ఎండింగ్ లో మంచి ఎమోషన్ తో ఎండ్ చేయడం బాగుంది. ఇలా ఓవరాల్ గా అయితే ట్రైలర్ ఆకట్టుకునేలానే ఉంది. ఇక ఈ చిత్రంని యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించగా ఈ మే 31న థియేట్రికల్ గా సినిమా రాబోతుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు