కార్తికేయ 90ఎంఎల్ టీజర్ డేట్ ఫిక్స్డ్

Published on Sep 18, 2019 3:00 pm IST

హీరో కార్తికేయ ఇటీవల గుణ 369 చిత్రంతో అలరించాడు. వరుసగా చిత్రాలు చేస్తున్న ఈ యంగ్ హీరో తన తదుపరి చిత్రానికి 90ఎంఎల్ అనే ఓ డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశాడు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన దక్కించుకుంది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తుండగా, ఎర్రా శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకొంది.

కాగా ఈనెల 21న ఉదయం 10:35 నిమిషాలకు ఈ చిత్ర టీజర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ అనౌన్స్మెంట్ పోస్టర్ ని విడుదల చేశారు. గులాబీ మొక్కకి నీళ్లకు బదులు ఆల్చహాల్ పోస్తున్న కార్తికేయ పోస్టర్ ఆసక్తినిరేపుతుంది. మూవీ పోస్టర్స్ చూస్తుంటే వైన్ అండ్ విమెన్ కాన్సెప్ట్ తో కొత్తగా దర్శకుడు తెరకెక్కిస్తాడనిపిస్తుంది. ఈ మూవీ అసలు సంగతి తెలియాలంటే టీజర్ రావలసిందే. హీరో కార్తికేయ తాజాగా గ్యాంగ్ లీడర్ చిత్రంలో విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More