హైదరాబాద్ థియేటర్లలో సందడి చేయనున్న ‘కార్తికేయ’ టీం.

karthikeya1
మంగళవారం హైదరాబాద్ లోని థియేటర్లలో ‘కార్తికేయ’ మూవీ టీం సందడి చేయనున్నారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల ప్రసంశలతో పాటు ప్రేక్షకుల ఆదరణ లభించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఇంతటి ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి సిటీ టూర్ ప్లాన్ చేశారు.

ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో గల దేవి థియేటర్లో మార్నింగ్ షో టికెట్స్ ను నిఖిల్ & టీం సేల్ చేయనున్నారు. తర్వాత శ్రీరాములు, శివపార్వతి, మేఘ, ప్రసాద్ ఐ మాక్స్ థియేటర్లను విజిట్ చేస్తారు. ఈ విషయాన్ని హీరో నిఖిల్ ట్విట్టర్ లో వెల్లడించారు. ‘స్వామి రా రా’ సినిమా విజయం తర్వాత నిఖిల్ అదే తరహా జోనర్ లో ‘కార్తికేయ’తో మంచి హిట్ అందుకున్నాడు.

Exit mobile version